: ఆదివారం కేంద్ర కేబినెట్ విస్తరణకు ఛాన్స్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం తొలి కేబినెట్ విస్తరణను చేపట్టనున్నారు. ఈ క్రమంలో తన కేబినెట్ లో కొత్తవారికి మంత్రులుగా అవకాశం ఇవ్వబోతున్నారు. ఆ రోజే వారి ప్రమాణ స్వీకారం కూడా జరగనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గోవా సీఎం మనోహర్ పారికర్, శివసేన ఎంపీ అనిల్ దేశాయ్, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హాలకు మంత్రివర్గంలో చోటు దక్కనుందని తెలుస్తోంది. ఇప్పటికే విస్తరణ గురించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్రం అనధికారికంగా తెలియజేసినట్లు వినికిడి. కాగా, రేపు విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.