: మరుగుదొడ్డి కోసం మంగళసూత్రం అమ్మింది... సర్కారు సన్మానం అందుకుంది


మహారాష్ట్రలోని వషీం జిల్లాలో సాయిఖేదా గ్రామంలో నివసించే సంగీత అహ్వాలేను గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పంకజ ముండే సన్మానించారు. అందుకు కారణం ఉంది. నగల కంటే మరుగుదొడ్డే ముఖ్యమని భావించింది సంగీత. మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఉన్న నగలన్నింటిని అమ్మేసింది... మహిళలు ప్రాణప్రదంగా భావించే మంగళసూత్రం సహా! ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో, ఆమెను ప్రభుత్వం తరపున మంత్రి పంకజ ముండే తన కార్యాలయంలో సన్మానించారు. దీనిపై సంగీత మాట్లాడుతూ, మరుగుదొడ్డి అనేది ప్రాథమిక అవసరమని పేర్కొంది. అందుకే నగలమ్మానని తెలిపింది. మంత్రి పంకజ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా తనకు కేటాయించిన నిధుల్లో 25 శాతం నిధులను టాయిలెట్ల నిర్మాణం కోసం ఖర్చు చేస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News