: యాంటీ బయాటిక్స్ కు ప్రత్యామ్నాయంగా కొత్త మందు!
వైద్య రంగంలో ఓ ముందడుగు పడింది. యాంటీ బయాటిక్స్ కు ప్రత్యామ్నాయంగా తొలి ప్రభావవంతమైన కొత్త మందును సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఔషధ-నిరోధక అంటువ్యాధులపై పోరాడేందుకు ఆ మందు సహాయపడనుంది. మొదటగా ఆ మందును ఓ రోగిపై ప్రయోగించగా, ఎంఆర్ఎస్ఏ బాక్టీరియాను సమర్థవంతంగా నిర్మూలించేందుకు ప్రభావం చూపినట్లు తేలింది. ఈ కొత్త చికిత్స విధానంవల్ల అంటువ్యాధి అంత తొందరగా అభివృద్ధి కాలేదని, చర్మ వ్యాధులకు ఇప్పటికే ఇది ఓ క్రీము రూపంలో అందుబాటులో ఉందని సైంటిస్టులు చెప్పారు. అయితే, ఐదేళ్లలో దానిని ఓ టాబ్లెట్ రూపంలో లేదా ఇంజెక్షన్ రూపంలో తీసుకురాగలమని భావిస్తున్నారు. ఈ చికిత్స "క్రిమినాశక-నిరోధక బ్యాక్టీరియాపై పోరాటంలో ఒక కొత్త శకం" అని బయోటెక్నాలజీ సంస్థ 'మిక్ రియోస్' చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ ఆఫర్హాస్ తెలిపారు.