: ఇంత చెత్త సినిమా చూడలేదు: అమితాబ్ అర్ధాంగి జయ
"అభిషేక్ ఉన్నాడు కాబట్టే ఆ సినిమాను చూశాను. అసలంత చెత్త సినిమా ఈ మధ్య కాలంలో చూడలేదు"... అమితాబ్ బచ్చన్ అర్థాంగి, హీరో అభిషేక్ బచ్చన్ తల్లి జయ బచ్చన్ చేసిన కామెంట్ ఇది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాపై జయ పైవిధంగా తన అభిప్రాయం తెలిపారు. ఇప్పటి సినిమాల్లో కళాదృష్టి లోపిస్తోందని, అందుకే తాను నటించడం మానుకున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పటి సినిమాలను వ్యాపార దృక్పథంతో నిర్మిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇటీవలే విడుదలైన 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుని హిట్ సినిమాగా టాక్ తెచ్చుకుంది.