: కపిల్ నిరాశపరిచాడు: ఆత్మకథలో సచిన్
తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో సచిన్ టెండూల్కర్ ఎన్నో విషయాలను ప్రస్తావించాడు. వివాదాస్పద అంశాలతో పాటు తనకు బాధ కలిగించిన విషయాలను కూడా పేర్కొన్నాడు. తాను రెండో పర్యాయం భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సమయంలో దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ కోచ్ గా వ్యవహరించాడని పుస్తకంలో తెలిపాడు. 1999-2000 సీజన్లో జరిగిన ఆసీస్ పర్యటనలో కోచ్ గా కపిల్ నుంచి ఎంతో ఆశించానని పేర్కొన్నాడు. అయితే, కపిల్ నిరాశపరిచాడన్నాడు. మ్యాచ్ లో అనుసరించాల్సిన వ్యూహ రచనలో కపిల్ పాలుపంచుకునేవాడు కాదని తెలిపాడు. చర్చల్లో పాల్గొనేవాడు కాదని పేర్కొన్నాడు.