: వరల్డ్ కప్ కు ముందు ఆసీస్ టూర్ ఓ సదవకాశం: ధోనీ


వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ కు ముందు ఆసీస్ లో పర్యటించనుండడం ఓ సదవకాశమని టీమిండియా రెగ్యులర్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ ను గెలుచుకుంటామని ధీమాగా చెప్పాడు. నైపుణ్యాలకు సానబెట్టుకునేందుకు ఆసీస్ టూర్ ను వినియోగించుకుంటామని పేర్కొన్నాడు. పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ టూర్ ఉపకరిస్తుందన్నాడు. 2011లో వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత యూకేలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ టైటిల్ సాధించామని తెలిపాడు. జట్టు సత్తాకు ఈ భారీ విజయాలే నిదర్శనమన్నాడు. టెస్టు సిరీస్ కోసం వచ్చే నెలలో ధోనీ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News