: ఈ నెల 8 నుంచి ఏపీపై తుపాను ఎఫెక్ట్


బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో ఇది తుపానుగా మారే అవకాశం ఉంది. విశాఖకు ఆగ్నేయ దిశలో 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించనుంది. అయితే, తీరానికి సమీపించిన తర్వాత ఇది బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 8 నుంచి ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. అన్ని రేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరేశారు. ఇప్పటికే 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులను వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News