: ఏసీబీ వలలో పెందుర్తి వీఆర్వో


విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో వీఆర్వో రవీంద్ర పాల్ గురువారం అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. బాధితుల ఫిర్యాదు నేపథ్యంలో ఏసీబీ అధికారులు పక్కాగా వలపన్ని రవీంద్ర పాల్ ను పట్టుకున్నారు. గురువారం బాధితులను తహశీల్దార్ కార్యాలయానికి పంపిన ఏసీబీ అధికారులు, ఆ తర్వాత కార్యాలయంపై దాడి చేశారు. ఆ సమయంలో బాధితుల నుంచి డబ్బులు తీసుకుంటూ రవీంద్ర పాల్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.

  • Loading...

More Telugu News