: నేడు రాష్ట్రపతిలో భేటీ కానున్న ప్రధాని మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోగానే తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్న మోదీ, ఈ నెల 10న అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని బుధవారం సాయంత్రం నుంచి వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక, గోవా సీఎం మనోహర్ పారికర్ ను మంత్రివర్గంలోకి తీసుకుని కేంద్ర రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించడం కూడా ఖాయమేనన్న వాదనా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతితో ప్రధాని భేటీ కానున్నారన్న వార్తలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.