: 'స్వచ్ఛ భారత్'లో బాలయ్య
టాలీవుడ్ టాప్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం 'స్వచ్ఛ భారత్ అభియాన్' లో పాల్గొన్నారు. ఓ చిత్రం షూటింగ్ నిమిత్తం అరకులోయ వచ్చిన బాలయ్య బుధవారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో భాగంగా చెత్తను ఊడ్చారు. అరకు మండలం పద్మాపురం పంచాయతీ యండపల్లివలసలో 'స్వచ్ఛ భారత్' లో పాల్గొన్న ఆయన స్థానికుల్లో ఉత్సాహం నింపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన ప్రజలకు వివరించారు. 2004కు ముందు చంద్రబాబు సీఎంగా ఉండగా జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ లాంటి కార్యక్రమాలను అమలు చేశామని, తాజాగా మోదీ సర్కారు జన్మభూమి తరహాలోనే 'స్వచ్ఛ భారత్ అభియాన్'ను అమలు చేస్తోందని అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన ఆరోపించారు.