: శంషాబాద్ విమానాశ్రయంలో 8 మంది అరెస్టు 05-11-2014 Wed 20:11 | శంషాబాద్ విమానాశ్రయాధికారులు 8 మందిని అరెస్టు చేశారు. వీరంతా నకిలీ ధృవపత్రాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించారని అధికారులు వివరించారు. తనిఖీ సిబ్బంది వారిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారని వారు పేర్కొన్నారు.