: కూతురుకి 10 కోట్లిచ్చి... పేదలకు ఛాయ్ డబ్బులిచ్చారు: రేవంత్
'నాయనా, బతుకమ్మ పండగ చేసుకుంటా' అని ఎంపీ కవిత అంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పది కోట్ల రూపాయలు కేటాయించారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన హైదరాబాదులో మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పేద విద్యార్థులు చదువుకునేందుకు నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురు చూస్తే, 25 కోట్లు విదిలించారని ఆయన విమర్శించారు. అంటే లెక్కల ప్రకారం చూస్తే ప్రతి విద్యార్థికి ఛాయ్ డబ్బులిచ్చారని ఆయన మండిపడ్డారు. ఉచిత నిర్బంధ విద్య అని చెప్పిన ముఖ్యమంత్రికి తన మాటలు గుర్తు లేవా? అని ఆయన నిలదీశారు.