: దిగ్గజాల సమక్షంలో 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని అభిమానులకు అంకితం చేసిన సచిన్
భారతరత్న సచిన్ టెండూల్కర్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని ముంబైలో దిగ్గజ క్రికెటర్ల సమక్షంలో ఆవిష్కరించారు. తన పుస్తకం అభిమానులకే అంకితమని ఆయన పేర్కొన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సచిన్ కంటే సీనియర్లు, జూనియర్లు, సమకాలీన క్రికెటర్లు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. క్రికెట్ దిగ్గజాలైన గవాస్కర్, వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, గంగూలీ, ద్రవిడ్, వివీఎస్ లక్ష్మణ్ లు సచిన్ తో తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. డ్రెస్సింగ్ రూం కబుర్లు కలబోసుకున్నారు. బయటి ప్రపంచానికి తెలియని విషయాలను నెమరువేసుకున్నారు.