: కాంగ్రెస్ అధిష్ఠానంపై చిదంబరం కుమారుడి విమర్శలు


మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుమారుడు కార్తి కాంగ్రెస్ అధినాయకత్వంపై, పార్టీ కార్యాచరణ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. దాంతో, తమిళనాడు కాంగ్రెస్ లో పార్టీపై ఆరోపణలు చేస్తున్న వారిలో ఈయన కూడా చేరారు. రాష్ట్ర పార్టీ యూనిట్ స్వయంప్రతిపత్తిని ఆస్వాదించడం లేదని, పార్టీ బలహీనపడిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ, "పార్టీ కార్యాచరణ విధానాన్ని పునఃపరిశీలించే పరిశీలకుడు కావాలనుకుంటున్నాం. తమిళనాడు కాంగ్రెస్ కు చాలా స్వయంప్రతిపత్తి అవసరం. ఢిల్లీ నుంచి సమస్యకు పరిష్కారం రాదు. కేరళలాంటి రాష్ట్ర యూనిట్ కావాలనుకుంటున్నా. అది స్వతంత్ర, శక్తిమంతమైన యూనిట్. స్వయంప్రతిపత్తి విధానంలో వారు పార్టీ యూనిట్ ను నడుపుతున్నారు" అని చిదంబరం కుమారుడు కార్తీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News