: తొలి కాపీ అమ్మదే... మార్కెట్లోకి సచిన్ 'ప్లేయింగ్ ఇట్ మై వే'
'ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే', 'ఎంత ఎదిగినా, అమ్మ తరువాతే ఎవరైనా' అనే మాటలను నిజం చేశాడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సచిన్ ఆత్మకథ ఆవిష్కృతమైంది. 'ప్లేయింగ్ ఇట్ మై వే' పేరిట సచిన్ తన అంతరంగాన్ని ఆవిష్కరించిన పుస్తకం విడుదలైంది. పుస్తకం విడుదల చేసిన సచిన్ తొలి కాపీని తన తల్లి రజనీకి అందించాడు. తన ఆత్మకథను అందుకున్న అమ్మ ముఖంలో కనిపించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని సచిన్ ట్వీట్ చేశాడు. పుస్తకం తన తల్లికి అందిస్తున్న ఫోటోను కూడా సచిన్ ట్వీట్ కు జత చేశాడు. ఓవరాల్ గా వంద సెంచరీల రికార్డు నమోదు చేసిన బ్యాటింగ్ మేస్ట్రో సచిన్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' విడుదలకు ముందే ఆసక్తి రేపింది. సచిన్ కెరీర్లోని ఎత్తుపల్లాలు, అనుభవాలు కలగలిసిన ఈ పుస్తకం ఆదరణ పొందుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.