: మీ వడ్డీలను మేమే కడతాం: చంద్రబాబు


టీడీపీ సర్కారు పేదలకు అండగా ఉంటుందని, పేదవారి కష్టాల్లో పాలుపంచుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. తమది పేదల ప్రభుత్వమన్నారు. చిత్తూరు జిల్లా అంగళ్లులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామని అన్నారు. పొదుపు ఉద్యమం తెచ్చామని, రివాల్వింగ్ ఫండ్ ఇప్పించానని తెలిపారు. రైతు రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు, డ్వాక్రా సంఘాలు కూడా కష్టాల్లో ఉన్నాయని వారికి కూడా రుణమాఫీ ప్రకటించామని చెప్పారు. మహిళల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. బ్యాంకులకు వారు కట్టాల్సిన వడ్డీలను తామే కడతామని స్పష్టం చేశారు. తాము ప్రకటన చేసిన తర్వాత ఎవరైనా వడ్డీ కట్టి ఉంటే, వారి వడ్డీని తిరిగిప్పిస్తామని బాబు తెలిపారు. గ్రామాల్లో ప్రస్తుతం రైతులకు 7 గంటల విద్యుత్ ఇస్తున్నామని, మున్ముందు 9 గంటల విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఇళ్లకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. ఇక, రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి కోసం 7 మిషన్లు ప్రవేశపెట్టామన్నారు. గ్రామాల్లో రూ.2 కే 20 లీటర్ల మినరల్ వాటర్ ను అందించే ఏర్పాట్లు చేశామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆసరాగా, ప్రతి ఇంటికి ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్ ఇస్తామని, తద్వారా సమాచార సాంకేతిక విప్లవ ఫలితాలు అందరికీ అందుబాటులోకి వస్తాయన్నారు. ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుంచే కార్యకలాపాలు సాగించే విధంగా మెరుగైన బ్యాండ్ విడ్త్ ను ప్రవేశపెడతామన్నారు. ఇలాంటి పథకాల ద్వారా సంపద పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News