: సింగపూర్లో బెంగాలీ నటి చేతివాటం!
'డిటెక్టివ్ బ్యోమ్ కేశ్ బక్షి' సినిమా ద్వారా బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న బెంగాలీ నటి స్వస్తిక ముఖర్జీ సింగపూర్లోని ఓ బొటిక్ లో చేతివాటం ప్రదర్శించిందన్న విషయం సంచలనం కలిగిస్తోంది. ఓ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఆమె తన బాయ్ ఫ్రెండ్ సుమన్ ముఖర్జీతో కలిసి సింగపూర్ వెళ్లింది. అక్కడ ఓ బొటిక్ ను సందర్శించిన సందర్భంగా, రూ.13,830 విలువైన ఇయర్ రింగ్స్ ను తస్కరించిందట. ఈ విషయాన్ని తమ బొటిక్ లోని సీసీటీవీలు బంధించాయని, ఫుటేజి చూస్తే నటి దొంగతనానికి పాల్పడిన విషయం అర్థమవుతోందని బొటిక్ యజమానురాలు అప్సరా ఓస్వాల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులకు లేఖ రాశారు. అయితే, దీనిపై ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సోమవారం ఉదయమే స్వస్తిక తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి హోటల్ రూం ఖాళీ చేసి వెళ్లిపోయినట్టు సమాచారం. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.