: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే బడ్జెట్ ఇది: కేసీఆర్
అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా బడ్జెట్ ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి, టీఆర్ఎస్ ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టోకు అనుగుణంగానే బడ్జెట్ ఉందని చెప్పారు. అన్ని పథకాలకు బడ్జెట్ లో సముచిత స్థానం లభించిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 'బంగారు తెలంగాణ' లక్ష్యంగా అన్ని శాఖలు పురోగమించాలని, శాఖల వారీగా కార్యాచరణ రూపొందించుకుని ప్రజల భాగస్వామ్యంతో బడ్జెట్ లక్ష్యాలు సాధించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.