: నష్టాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తాం: అరుణ్ జైట్లీ
నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ప్రభుత్వ రంగంలో నష్టాలను మూటగట్టుకుంటున్న కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళిలే లాభాల బాట పడతాయన్న నమ్మకం ఉందని బుధవారం వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ ఈ మేరకు అభిప్రాయపడ్డారు.