: తెలంగాణ బడ్జెట్ వివరాలు - 3


తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవే... * మెట్రో రైల్ కు రూ. 417 కోట్లు. * మురికివాడల అభివృద్ధికి రూ. 580 కోట్లు. * పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్ (దీపం పథకం) కు రూ. 100 కోట్లు. * జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధికి రూ. 250 కోట్లు. * రహదారుల అభివృద్ధికి రూ. 4 వేల కోట్లు. * వచ్చే ఐదేళ్లలో 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు. * మూడేళ్ల తర్వాత అందరికీ 24 గంటల విద్యుత్ సరఫరా. * కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 330 కోట్లు. * మైనార్టీల సంక్షేమానికి రూ. 1,030 కోట్లు. * ఎస్సీ ఉపప్రణాళికకు రూ. 7,579 కోట్లు. * ఎస్టీ ఉపప్రణాళికకు రూ. 4,559 కోట్లు. * ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ. 97 కోట్లు. * గోదావరి పుష్కరాలకు రూ. 100 కోట్లు. * రైతులకు సోలార్ పంపు సెట్లకు రూ. 200 కోట్లు.

  • Loading...

More Telugu News