: సచిన్ నిజం చెప్పాడు: మురళీధరన్
టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పై సచిన్ చేసిన సంచలన వ్యాఖ్యలను శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ సమర్థించాడు. ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పేరిట నేడు విడుదల కానున్న బయోగ్రఫీలో సచిన్, చాపెల్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ సభ్యులతో పాటు ప్రపంచ క్రికెటర్లు కూడా స్పందించారు. అదేవిధంగా తాజాగా ముత్తయ్య మురళీధరన్ కూడా సచిన్ వ్యాఖ్యలపై నర్మగర్భంగానే వ్యాఖ్యానించారు. "సచిన్ వాస్తవం చెప్పాడు. తన గుండె లోతుల్లోంచే ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత్ వీటిని సానుకూలంగా తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి" అని ముత్తయ్య చెప్పాడు. "టీమిండియా కోచ్ గా చాపెల్ పదవీకాలం ముగిసింది. దీంతో సచిన్ వ్యాఖ్యలతో పెద్ద ఇబ్బందేమీ ఉండదు. అంతేకాక దీనిపై వివాదం రేపాల్సిన అవసరం కూడా ఏమీ లేదు" అని కూడా అతడు అభిప్రాయపడ్డాడు.