: ఆసియా పసిఫిక్ దేశాల్లో పర్యటించనున్న ఒబామా... మోదీతో భేటీ అయ్యే ఛాన్స్!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆసియా పసిఫిక్ దేశాల్లో పర్యటించనున్నారు. చైనా, మయన్మార్, ఆస్ట్రేలియా దేశాల్లో పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. బీజింగ్ లో నవంబర్ 10 నుంచి 12 వరకు జరిగే అపెక్ దేశాల సదస్సులోనూ, మయన్మార్ లో నవంబర్ 12 నుంచి 14 వరకు జరిగే యూఎస్ ఆసియాన్ సదస్సులోనూ, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో నవంబర్ 15 నుంచి 16 వరకు జరిగే జి-20 నేతల సమావేశంలోనూ అధ్యక్షుడు ఒబామా పాల్గొంటారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, మయన్మార్ లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ... మోదీతో ఒబామా భేటీ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 30న వైట్ హౌస్ లో వీరిరువురూ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఆ చర్చల తాలూకు పురోగతి ఎలా ఉందన్న విషయంపై తాజా సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.