: పీర్ల పండుగ సందర్భంగా ఘర్షణ... 20 మందికి గాయాలు
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో పీర్ల పండుగ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఉదయం చోటు చేసుకున్న ఈ ఘర్షణలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో, పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో, స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లతో పాటు 20 మంది గాయపడ్డారు. ఒకానొక సందర్భంలో, పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ, సీఐ, ఎస్సైలను స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసు జీపు ధ్వంసమయింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో, అదనపు బలగాలను గ్రామానికి రప్పిస్తున్నారు.