: ఈ ప్యాక్ తో తిరుమలేశుడి లడ్డూ 90 రోజుల దాకా నిక్షేపం!


తిరుమల వెంకన్న ప్రసాదం ప్రపంచ ప్రసిద్ధం. వెంకన్న భక్తులే కాక ఇతర మతాల వారు కూడా ఈ ప్రసాదంపై మక్కువ చూపడం కద్దు. ఏళ్లుగా తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న తిరుమల లడ్డూ త్వరగా పాడవుతోందన్న భక్తుల ఫిర్యాదులకు ఇప్పుడు బెంగకు చెక్ పడుతోంది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) తాజాగా రూపొందించిన ప్రత్యేక ప్యాక్ తో తిరుమల ప్రసాదం 90 రోజుల దాకా నిక్షేపంగా ఉంటుంది. కేవలం రూ.1-2 మధ్య ఖర్చుతో తయారు చేయనున్న ఈ ప్యాకెట్ ను తిరుమలకు అందించేందుకు టీటీడీ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు ఐఐపీ ఎన్.సీ.సాహా తెలిపారు. తిరుమలకు వస్తున్న భక్తులకే కాక రాలేని పరిస్థితిలో ఉన్న భక్తులకు కూడా ప్రసాదాన్ని అందించేందుకు గతంలోనే టీటీడీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాక తిరుమలకు వస్తున్న సుదూర ప్రాంతాల భక్తులు స్వామి వారి దర్శనం తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్లేందుకు రోజుల తరబడి సమయం పడుతోంది. దీంతో వెంకన్న ప్రసాదం ఎక్కడ పాడవుతుందోనన్న ఆదుర్దా భక్తుల్లో ఉండేది. ఇప్పుడీ కొత్త ప్యాక్ తో దానికి చెక్ పెట్టచ్చని సాహా తెలిపారు.

  • Loading...

More Telugu News