: 'ప్రజారాజ్యం'లాగే జగన్ పార్టీ కూడా విలీనం అవుతుంది: సీఎం రమేష్
చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలాగానే రాబోయే రోజుల్లో జగన్ పార్టీ వైకాపా కూడా ఏదో ఒక పార్టీలో విలీనం అవుతుందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలిపేశారని... ప్రస్తుతం వైకాపా ఆఫీనును జగన్ లోటస్ పాండ్ కు మార్చారని... ఇక మిగిలింది వైకాపాను ఏదో ఒక పార్టీలో విలీనం చేయడమేనని ఎద్దేవా చేశారు. భారతి సిమెంట్స్ వద్ద కార్మికులు ధర్నా చేస్తుంటే యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.