: తప్పు నాది కాదు...మీడియాది: మంత్రి రావెల
బీజేపీతో పొత్తుపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు వివరణ ఇచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తన మాటలను మీడియా వక్రీకరించిందని పేర్కొన్నారు. అవసరమైతే బీజేపీతో పొత్తును తెంచుకునేందుకు వెనుకాడమనే అర్థం వచ్చే వ్యాఖ్యలు చేశారంటూ దుమారం రేగడంతో మంత్రిని సీఎం చంద్రబాబు వివరణ అడిగారు. దీంతో మీడియా తన వ్యాఖ్యలు వక్రీకరించిందని ఆయన సీఎంకు వివరణ ఇచ్చారు.