: రాజుగారు తీరిగ్గా వచ్చి మొక్కలు నాటుతున్నారు: అశోక్ గజపతిపై బొత్స సెటైర్
హుదూద్ తుపాను ధాటికి విజయనగరం జిల్లా తీవ్రంగా నష్టోయిన 15 రోజుల తరువాత జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తీరిగ్గా మొక్కలు నాటుతున్నారని ఎద్దేవా చేశారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, ఇంకా రాజుగారికి రాచరికపు వాసనలు పోలేదని అన్నారు. తుపాను బాధితులకు భరోసా ఇవ్వడంలో కేంద్ర మంత్రి విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు తమ కుటుంబ సభ్యులను డ్వాక్రా సంఘాల్లో చేర్చి ఇసుక దోపిడీకి రంగం సిద్ధం చేశారని ఆయన ఆరోపించారు.