: కాంగ్రెస్ లో వికెట్ పడింది... టీఆర్ఎస్ లో చేరిన రెడ్యానాయక్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆ పార్టీకి ఝలక్కిచ్చారు. వరంగల్ జిల్లాకు చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ టీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తన కుమార్తె, మాజీ ఎమ్మెల్యే కవితతో పాటు ఆయన టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఆయనతో పాటు డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు టీఆర్ఎస్ లో చేరారు.