: ఆరోన్ స్థానం బిన్నీతో భర్తీ... ముమ్మరంగా వరల్డ్ కప్ సన్నాహకాలు


శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ లోని తొలి వన్డేలో టీమిండియా స్పీడ్ స్టర్ వరుణ్ ఆరోన్ గాయపడడంతో అతని స్ధానంలో ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి రానున్నాడు. రెండవ, మూడవ వన్డే మ్యాచ్ ల కోసం బిన్నీని జట్టులోకి తీసుకున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. ఈ నెల ఆరున అహ్మదాబాద్ లో జరగనున్న రెండో వన్డేకి బిన్నీ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు. కాగా, బిన్నీ బంగ్లాదేశ్ తో జూన్ లో జరిగిన మ్యాచ్ తరువాత అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడలేదు. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ కోసం టీమిండియా సన్నాహకాలు ఆరంభించినట్టు కనిపిస్తోంది. టీమిండియా ప్రధాన ఆటగాళ్లతో పాటు, రిజర్వ్ బెంచ్ ను కూడా సన్నద్ధం చేస్తోంది. దేశవాళీ పోటీల్లో సత్తాచాటిన, ఫాంలో ఉన్న మెరికల్లాంటి ఆటగాళ్లను కూడా బీసీసీఐ సిద్ధం చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. శ్రీలంక సిరీస్ తరువాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో టీమిండియా పాల్గొంటున్న నేపథ్యంలో, దేశవాళీ క్రికెట్ పోటీల ద్వారా ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను సన్నద్ధం చేయనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News