: వర్ధమాన నటీనటులకు షారుక్ ఖాన్ సలహా


అనేకమందికి స్పూర్తిగా నిలిచిన నటుడు షారుక్ ఖాన్, సినీ పరిశ్రమలో పైకి వచ్చేందుకు కష్టపడుతున్న నటీనటులకు ముఖ్యమైన సలహా ఇచ్చాడు. తమ రూపం గురించి కాకుండా వృత్తి పట్ల ఆందోళన ఉండాలని సూచించాడు. ప్రస్తుత నటీనటులకు ఏమైనా సలహా ఇస్తారా? అని అడిగిన దానికి తను పైవిధంగా స్పందించాడు. "మీరు కష్టపడి పనిచేయాలి, నటనపై దృష్టి పెట్టాలి. అయితే, పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్), పోర్ట్ ఫోలియో చాలా ముఖ్యమే. కానీ, నటన అంతకంటే ప్రధానమైంది. అందుకే నటించడంపై దృష్టి సారించండి. ప్లాన్ చేసుకుని ఎవరూ నటులు కాలేరు. అందుకే మీ దుస్తులపై, మేకప్ పై ఫోకస్ పెట్టకండి. మీ యాక్టింగ్ గురించే ఎక్కువగా ఆలోచించండి" అని షారుక్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News