: టీడీపీకి భయపడే కేసీఆర్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాడు: నర్సారెడ్డి


తెలుగుదేశం పార్టీకి భయపడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగివచ్చారని ఆ పార్టీ నేత అరికెల నర్సారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టుభవన్ లో ఆయన మాట్లాడుతూ, ఏపీకి నిరాటంక విద్యుత్ సరఫరా, టీటీడీపీ బస్సు యాత్ర తదితర అంశాల నేపథ్యంలో కేసీఆర్ దిగివచ్చారన్నారు. హుటాహుటీన ఛత్తీస్ గఢ్ వెళ్లి విద్యుత్ ఒప్పందాలు చేసుకొచ్చారని, లేకుంటే ఆయన వెళ్లేవారు కాదని అన్నారు. పంటలన్నీ ఎండిపోయాక 'వరి వెయ్యకండి' అంటూ సూచనలు చేస్తున్నారని, రైతులు అన్నం తినకుండా ఏం తింటారని ఆయన ప్రశ్నించారు. టీటీడీపీని టీఆరెస్ లో విలీనం చేయాలని ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్ కు చెప్పడాన్ని సుమోటోగా స్వీకరించి వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు పార్టీని విలీనం చేయాలని చెప్పడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News