: ఈసారి మాదకద్రవ్యాలపై మోదీ రేడియో ప్రసంగం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభిన్న తరహాలో దేశ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మీడియాతో సమావేశాలు, ప్రసంగాలు కాకుండా ఆధునికరీతిలో సోషల్ మీడియా, ఆకాశవాణిలను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే రెండుసార్లు 'మన్ కీ బాత్' పేరుతో రేడియో ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మళ్లీ రేడియోలో మూడో ప్రసంగం చేయనున్నారు. ఈసారి మాదకద్రవ్యాలపై మోదీ మాట్లాడతారు. ఇందుకుగాను, ఈ దిశగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలను సలహాలు, సూచనలు అడిగారు. మాదకద్రవ్యాలకు బానిసలైన వారిని విముక్తులు చేసే దిశగా స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు జరిపే పోరాటంలో ఎదుర్కొన్న అనుభవాలను తనకు రాయమని ట్విట్టర్ లో ప్రధాని కోరారు.