: మేకప్ మెన్లుగా పురుషులేనా?...ఇది లింగ వివక్షే!: సుప్రీంకోర్టు


భారతీయ సినీ చరిత్రలో మేకప్ ఉమెన్ అన్న పేరు విన్నామా? లేదు కదూ. అంటే, ఆది నుంచి సినిమా రంగంలోని మేకప్ విభాగాన్ని పురుషులే ఏలుతున్నారన్నమాట. అందుకే మేకప్ మెన్ అంటున్నాం, కాని మేకప్ ఉమెన్ అన్న పదమే నేటికీ మన చెవిన పడలేదు. ఈ దురవస్థ లింగ వివక్ష కారణంగానే ఉత్పన్నమైందని తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అవకాశాలు రాకున్నా ప్రముఖ మేకప్ ఉమెన్ గా ఖ్యాతి గాంచిన చారు ఖురానా దీనిపై సుప్రీంకోర్టుకెక్కారు. మేకప్ విభాగంలో పనిచేసేందుకు ఆమెను బాలీవుడ్ అనుమతించలేదట. అందుకే ఆమె కోర్టు మెట్లెక్కారు. దీంతో దీనిని ఆమూలాగ్రం పరిశీలించిన సుప్రీంకోర్టు మేకప్ రంగంలోకి మహిళలను అడ్డుకుంటే లింగ వివక్ష కింద అభియోగాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఒక్క బాలీవుడ్డేనా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం తెలుగులో శోభ అనే మేకప్ ఉమెన్ ను కూడా పరిశ్రమలో ఇలాగే అడ్డుకోవడం, ఆమెకు సభ్యత్వం ఇవ్వకుండా వేధించడం జరిగింది. ఇప్పుడీ విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా పరిస్థితిలో మార్పొస్తే, ఇకపై మేకప్ ఉమెన్ ల పేర్లను కూడా సినిమా టైటిల్స్ లో చూడొచ్చన్నమాట!

  • Loading...

More Telugu News