: విశాఖ మెట్రోపై ఆరు నెలల్లో సమగ్ర నివేదిక: శ్రీధరన్
విశాఖ మెట్రోకు సంబంధించి 6 నెలల్లో సమగ్ర నివేదిక తయారు చేస్తామని మెట్రో ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ తెలిపారు. మూడు, నాలుగేళ్లలో మొదటి దశ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని కూడా చెప్పారు. విశాఖలో మెట్రోరైలు ప్రతిపాదిత ప్రాంతాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విశాఖ, విజయవాడలో ఒకేసారి మెట్రో ప్రాజెక్టులు ప్రారంభిస్తామని వివరించారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు మొదటి దశలో 30 కిలోమీటర్ల కారిడార్లు నిర్మించనున్నామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టును భారంగా మార్చమని, ఖర్చు మొత్తాన్ని మెట్రో సమకూర్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని శ్రీధరన్ చెప్పారు.