: సన్మానం చేసిన మాట వాస్తవమే... వడ్డాణం మాత్రం ఇవ్వలేదు: మంత్రి పీతల సుజాత


ఏపీ గనులశాఖ మంత్రి విచిత్రమైన వివాదంలో ఇరుక్కున్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యాపారులు ఇటీవల సుజాతకు సన్మానం చేశారు. ఈ సన్మాన సమయంలో సుజాతకు రూ. 37 లక్షల విలువైన వడ్డాణాన్ని బహూకరించారనే ప్రచారం ఉవ్వెత్తున సాగుతోంది. దీనికి సంబంధించి, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సుజాతను పిలిచి వివరణ అడిగారని తెలుస్తోంది. దీనిపై స్పందించిన సుజాత, తనకు సన్మానం జరిగిన విషయం వాస్తవమేనని... అయితే, వడ్డాణం బహూకరించారనే విషయం మాత్రం అవాస్తవమని చెప్పారు.

  • Loading...

More Telugu News