: కేంద్ర ఆర్థిక శాఖలో మరో కొత్త కార్యదర్శి
కేంద్ర ఆర్థిక శాఖలోని కార్యదర్శి స్థాయిలో మరో మార్పు జరిగింది. 1981 గుజరాత్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి హస్ ముఖ్ అదియను ఆర్థిక వ్యవహారాల నూతన కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. గత రాత్రి కేబినెట్ నియామకాల కమిటీ ఆయన్ను ఆర్థిక సేవల విభాగం, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా నియామిస్తూ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సిబ్బంది, శిక్షణా విభాగం (డీఓపీటి) ఓ ప్రకటన జారీ చేసింది. గతనెల రెవెన్యూ కార్యదర్శి రాజీవ్ ఠాక్రును ఈశాన్య ప్రాంత శాఖకు, ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ ను పర్యాటక శాఖకు తరువాత మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మార్చిన అనంతరం ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఇది మూడో సెక్రటరీ లెవెల్ మార్పు కావడం గమనార్హం. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2015-16 బడ్జెట్ కసరత్తుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఈ బదిలీలు చేసినట్లు తెలుస్తోంది.