: తెలంగాణ రైతులను ఆదుకోలేని కేసీఆర్... విజయవాడ వచ్చి ఏం చేస్తారు?: వర్ల రామయ్య
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాడుతున్న భాష అత్యంత నీచంగా ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. కేసీఆర్ భాషను చూస్తుంటే... ఆయన తెలుగుజాతికి చెందినవాడని చెప్పుకోవడానికే సిగ్గుపడాల్సి వస్తోందని మండిపడ్డారు. విజయవాడలో బహిరంగసభ పెట్టి చంద్రబాబును ఎండగడతానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... తెలంగాణ రైతులను ఆదుకోలేని కేసీఆర్ విజయవాడకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మౌనంగా ఉన్నారని... ఆయన స్థానంలో కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు.