: తెలంగాణలో జంపు జిలానీలతో వచ్చిన నష్టమేమీ లేదు: ఏఐసీసీ కార్యదర్శి కుంతియా
కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న వారితో తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సీ. కుంతియా అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ లో చేరేందుకు ఇతర పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారని అన్నారు. పార్టీ ఫిరాయింపులను స్థానిక నాయకత్వ వైఫల్యంగా భావించలేమని కుంతియా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజలకు మేలు చేయగలదని ఆయన చెప్పారు.