: కోల్ కతాలో తొలి వాక్స్ మ్యూజియం... అమితాబ్, షారుక్ బొమ్మలు
లండన్ లోని పాప్యులర్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియం రీతిలో కోల్ కతాలో తొలి వాక్స్ మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ ల మైనపు బొమ్మలను ఉంచుతారు. ఈ నెల 10న కోల్ కతా నగరంలోని, న్యూటౌన్ ఫినాన్స్ సెంటర్ లో ఐదువేల చదరపు అడుగుల స్థలంలో మ్యూజియం భవనం ఏర్పాటవుతుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ మ్యూజియంను ప్రారంభిస్తారు. అందులో తొలిసారిగా పందొమ్మిది బొమ్మలను ఉంచనున్నారు. మదర్ థెరిస్సా పేరు మీద 'మదర్స్ మైనపు మ్యూజియం'గా నామకరణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మైనపు బొమ్మల రూపకర్త సుశాంత్ రే మాట్లాడుతూ, "నవంబర్ 10న మ్యూజియం ప్రారంభం కానుంది. తొలిదశలో 19 విగ్రహాలను ఉంచుతాం. డిమాండ్ మేరకు తరువాత చాలా విగ్రహాలు వస్తాయి" అని తెలిపారు. అదేరోజు విగ్రహాలను చూసి, ఫోటోలు తీసుకునేందుకు సందర్శకులకు కూడా అనుమతిస్తారు.