: యూఎస్ సెనేటర్ కు విషపు ఉత్తరం
అమెరికాలో రిపబ్లికన్ సెనేటర్ రోజర్ వికర్ కు నేడు విషం పూసిన ఉత్తరం అందింది. ఆ ఉత్తరానికి రిసిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషం పూసి ఉందని భద్రతా అధికారులు అంటున్నారు. పరీక్షల నిమిత్తం ఆ ఉత్తరాన్ని ప్రయోగశాలకు పంపారు. ఈ ఉత్తరం టెన్నిస్సీ రాష్ట్రంలోని మెంఫిస్ నగరం నుంచి వచ్చిందని అధికారులు తెలిపారు. 2004లోనూ పలువురు సెనేటర్లకు ఇదే విధంగా విషపు ఉత్తరాలు వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, ఓ చుక్క రిసిన్ కూడా ప్రాణాంతకంగా పరిణమించగలదని సెనేట్ అధికారులు తెలిపారు. ఇక ఈ ఉత్తరం ఎవరు పంపారన్న విషయంపై ఎఫ్ బీఐ దర్యాప్తు ప్రారంభించింది.