: మన్మోహన్ సింగ్ కు జపాన్ జాతీయ పురస్కారం


మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జపాన్ దేశ అత్యున్నత జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. భారత్-జపాన్ ల సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు సహకరించినందుకు గానూ 'ద గ్రాండ్ కోర్డాన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద పౌల్వినియ ఫ్లవర్స్' అవార్డును ఆయనకు ప్రకటించారు. ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్న తొలి భారతీయుడు మన్మోహన్ కావడం విశేషం. "జపాన్, భారత్ మధ్య 35 ఏళ్ల పాటు సంబంధాలు అభివృద్ధి పడేందుకు గణనీయమైన సహకారం, స్నేహాన్ని మన్మోహన్ సింగ్ పెంపొందించారు" అని జపాన్ రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అటు మన్మోహన్ కూడా ఈ పురస్కారం తనకు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News