: 'మేరు క్యాబ్' ఆఫీస్ పై డ్రైవర్ల దాడి... శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్తత
కనీస వేతనాలు అందించకుండా 'మేరు క్యాబ్' యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపిస్తూ డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు. సంస్థ కార్యాలయంపై డ్రైవర్లు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో, శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో వందలాది క్యాబ్ లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.