: కేసీఆర్ ఒక దద్దమ్మ... విజయవాడ వస్తే బొంద పెడతాం: బోండా ఉమ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ నేత బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బడ్జెట్ కూడా తయారు చేయడం చేతకాని దద్దమ్మ కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ రైతులకు ఐదు రూపాయల రుణమాఫీ కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయలేదని, ఈ విషయంపై అవసరమైతే విజయవాడలో సభ పెట్టి మాట్లాడుతానని కేసీఆర్ అన్న వ్యాఖ్యలపై ఉమ తీవ్రంగా స్పందించారు. విజయవాడలో అడుగు పెడితే, కేసీఆర్ భాషలో చెప్పాలంటే బొంద పెడతామని చెప్పారు. తెలంగాణలో ఎన్నో సమస్యలున్నా, పరిష్కరించడం చేతగాని సన్నాసి కేసీఆర్ అని అన్నారు. ఒక వైపు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో గొడవ పడుతూ, మరొకవైపు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకోకుండా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కేసీఆర్ అంధకారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు నెలల నుంచి తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదని... తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలే కేసీఆర్ కు బుద్ధి చెబుతారని అన్నారు.

  • Loading...

More Telugu News