: ఆలస్యంగా వచ్చిన వీకే సింగ్... ప్రసంగించేందుకు అనుమతించని ఆరెస్సెస్!


క్రమశిక్షణకు మారుపేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్). సామాన్యులైనా, కేంద్ర మంత్రులైనా... ఆ సంస్థ సిద్ధాంతాల్లో ఏమాత్రం మార్పుండదు. అందరికీ ఒకటే రూల్. తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్, ఆరెస్సెస్ క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. ఆగ్రాలో మూడు రోజుల ‘యువ సంకల్ప్ శిబిర్’ను ఆరెస్సెస్ నిర్వహిస్తోంది. మూడు రోజుల ఈ శిబిరంలో ఆదివారం వీకే సింగ్ ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆయన నిర్దేశిత సమాయానికి కాస్త ఆలస్యంగా వచ్చారు. అంతే, శిబిరంలో ప్రసంగించేందుకు ఆయనకు అనుమతి లభించలేదు. "ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించాల్సిన వీకే సింగ్ ‘సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పాలసీస్ ఆఫ్ ద కంట్రీ’పై గంట పాటు సభికులకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆయన 11 గంటల కంటే ముందుగానే వేదికకు చేరుకోవాలి. కాని సింగ్ 12.40 గంటలకు వచ్చారు. మా సిద్ధాంతం ప్రకారం ఆలస్యంగా వచ్చిన వారి కారణంగా కార్యక్రమ షెడ్యూల్ మార్చడం కుదరదు. అందుకే వీకే సింగ్ ను ప్రసగించేందుకు అనుమతించలేదు" అని ఆరెస్సెస్ మీడియా ఇన్ఛార్జ్ వీరేంద్ర వర్షనేయ అన్నారు. ఇదిలా ఉంటే, ఆలస్యంగా వచ్చిన వీకే సింగ్, మిగతా సభ్యుల మాదిరే వెనుక బెంచీల్లో కూర్చుండిపోవాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News