: సోనియా అల్లుడి విషయంలో మీడియాదే తప్పు: కాంగ్రెస్
మీడియాపై చిందులేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. వాద్రా ప్రజాజీవితంలో లేరని, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎలాంటి హోదాలోనూ లేరని స్పష్టం చేసింది. ప్రైవేట్ కార్యక్రమాల వద్ద మీడియా వాద్రాను పదేపదే ప్రశ్నించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మీడియా ఇలాంటి వైఖరి విడనాడాలని కాంగ్రెస్ హితవు పలికింది.