: సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కేరళలో తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్'కు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు కొందరు మద్దతు తెలిపారు. దీంతో వారికి వ్యతిరేకంగా బీజేఎంవై ఆందోళన నిర్వహించింది. రెండు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఉద్రక్త వాతావరణం నెలకొంది. కాగా, గత నెలలో కేరళలోని కోజికోడ్ లో కొంతమంది ప్రేమికులపై భజరంగ్ దళ్ కార్యార్తలు దాడులు చేశారు. దీనిపై ఆగ్రహించిన పలువురు యువతీ యువకులు 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం నిర్వహించతలపెట్టారు. కార్యక్రమంలో భాగంగా ముద్దులు, కౌగిలింతలతో భజరంగ్ దళ్ తీరుపై నిరసన తెలుపనున్నారు.