: ఆర్టీసీని లాభాల బాటపట్టిస్తాం: మంత్రి శిద్దా
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయకుండా లాభాల్లో నడిపిస్తామని రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శ్రీశైలంలో ఆయన మాట్లాడుతూ, ఆస్ట్రేలియా, పోలండ్ తరహాలో విశాఖ, విజయవాడ, తిరుపతి పట్టణాల బస్ స్టేషన్లను అభివృద్ధి చేస్తామని అన్నారు. తిరుపతిలో మూడు లేక నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చుతో బస్ డిపోను ఆధునికీకరిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా అరగంటలో చేరుకునేలా రహదారులను ఆధునికీకరిస్తామని ఆయన చెప్పారు. మార్చి నెలలోపు 1200 కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు. ఇందులో 200 బస్సులు అన్ని నియోజకవర్గాల నుంచి రాజధానికి చేరుకుంటాయని ఆయన తెలిపారు.