: మంచిదే... కేసీఆర్ ను విజయవాడ రమ్మనండి!: బాబు
విజయవాడ నడిబొడ్డున సభ పెట్టి ఆంధ్రప్రదేశ్ రైతుల పక్షాన పోరాడుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వాగతించారు. టీటీడీపీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ప్రజల పక్షాన పోరాడితే మంచిదేనని అన్నారు. తాను తెలంగాణలో ప్రజల పక్షాన పోరాడుతున్నానని, అలాగే కేసీఆర్ కూడా పోరాడవచ్చని తెలిపారు. అయితే కేసీఆర్ మాటలు ప్రజలు నమ్ముతారనే భావిస్తున్నారా? అని ఆయన ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. విద్యుత్ కొనుగోలు చేయడం చేతకాని కేసీఆర్, తనపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.