: వేములపల్లి మదర్సాలో దారుణం


నల్గొండ జిల్లా వేములపల్లి మదర్సా అరబిక్ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. మదర్సా అరబిక్ స్కూలులో 40 మంది పేద ముస్లిం విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, ముగ్గురు బాలురు మదర్సా నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ముగ్గురు బాలురను పట్టుకున్న మదర్సా నిర్వాహకులు గొలుసులతో బంధించారు. అనంతరం ఎలాగోలా వీరు ముగ్గురూ మదర్సా నుంచి తప్పించుకుని మిర్యాలగూడ చేరుకున్నారు. తమ కాళ్లకున్న గొలుసులు తీయించుకునే ప్రయత్నం చేస్తున్న ముగ్గురు విద్యార్థులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో మదర్సాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News