: బడ్జెట్ లో 60 శాతం నిధులు సంక్షేమానికే: యనమల


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో 60 శాతం నిధులను సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నామని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కాకినాడలోని సర్పవరంలో ఆయన మాట్లాడుతూ, రైతు రుణమాఫీకి 30 వేల నుంచి 40 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు. డ్వాక్రా రుణమాఫీకి 7 వేల కోట్ల రూపాయలు, పింఛన్లు చెల్లించేందుకు 5,500 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు ఆయన తెలిపారు. జన్మభూమి - మా వూరు కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News